కరోనా ఎఫెక్ట్ కి గూగుల్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్ కి గూగుల్ సంచలన నిర్ణయం

0
83

కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది, దీంతో ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మరణించారు.. చైనాని అయితే ఇప్పటికీ ఈ వైరస్ ఇంట్లో నుంచి జనాలని బయటకు రాకుండా నిలిపివేసింది అనే చెప్పాలి.

అయితే ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కరోనా టెస్టులు కూడా చేస్తున్నాయి ఉద్యోగులకి.. అంతేకాదు ఎవరైనా సిక్ గా ఉంటే వారిని ఇంటి దగ్గర నుంచి పని చేయమని కూడా కోరుతున్నాయి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు ఏటా నిర్వహించే ప్రాముఖ్యమైన ఈవెంట్లను రద్దు చేసుకుంటున్నాయి..

తాజాగా ఓ కీలక నిర్ణయం టెక్ దిగ్గజాలు తీసుకున్నాయి, తమ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పనిచేయాలంటూ గూగుల్, ట్విటర్ సహా పలు టెక్ సంస్థలు ప్రకటించాయి. డబ్లిన్లోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో దాదాపు 8 వేల మందికి కంపెనీ ఈ విషయం చెప్పిందట. అయితే ఇక్కడ ఓ ఉద్యోగికి ఈ లక్షణాలు కనిపించాయని అందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఇక ట్విటర్ కూడా అదే తెలిపింది, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల కార్యాలయ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలి అని తెలిపింది.