క‌రోనా ఎఫెక్ట్ తో ఓయో సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా ఎఫెక్ట్ తో ఓయో సంచ‌ల‌న నిర్ణ‌యం

0
92

హోటల్ రంగంలో ఓయో యాప్ వ‌చ్చిన త‌ర్వాత వారికి చాలా మేలు చేసింది అని అంటారు.. మొత్తానికి ఏ హోట‌ల్ రూమ్ కావాలి అన్నా. బుక్ చేసుకోవాలి అని అనుకున్నా ఓయోలోనే బుక్ చేసుకుంటున్నారు, ఆ యాప్ నుంచి పేమెంట్ చేస్తున్నారు చాలా మంది, రోజుకి కొన్ని వేల బుకింగ్స్ అవుతున్నాయి. కరోనా దీనికి బాగా ఎఫెక్ట్ చూపించింది.

తాజాగా అలాంటి యాప్ సంస్ధ హోటల్ యాజమాన్యాలకు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు ఓయో ప్రకటించింది. హోటల్ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న ఓయో కొంత కాలంగా ఆదాయం కోల్పోయింది. కరోనా వల్ల తన వ్యాపారం దాదాపుగా నిలిచిపోయిందని అందుకే హోటల్స్‌కు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు ఓయో యాజమాన్యం పేర్కొంది.

ఇక దీనిపై హోట‌ల్స్ కి కంపెనీ లేఖ‌లు రాసింది, ఇప్పుడు కంపెనీ ప‌రిస్ధితి గురించి కూడా తెలిపారు, కొద్ది రోజుల వ‌ర‌కూ ఇలాంటి క్రైసిస్ ఉంటాయి అని రీసెర్చ్ సంస్ధ‌లు కూడా చెబుతున్నాయి, ముఖ్యంగా హోట‌ల్ రంగంపై ఈ క‌రోనా ఎఫెక్ట్ బాగా ప‌డిన సంగ‌తి తెలిసిందే, ఈ క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత మ‌ళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయి అంటున్నారు.