క‌రోనా ఎఫెక్ట్ తో రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం ఆ టికెట్ ధ‌ర‌లు పెరిగాయి

క‌రోనా ఎఫెక్ట్ తో రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం ఆ టికెట్ ధ‌ర‌లు పెరిగాయి

0
83

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి మ‌రింత పెరుగుతున్నాయి… అందుకే కేంద్రం కూడా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది… మ‌న దేశంలో కూడా క‌రోనా కేసులు 100 దాటేశాయి, ఈ పాజిటీవ్ కేసులు మ‌రింత పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అందుకే దేశంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా చేరే మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్ల వంటి వాటికి మూతవేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది.

తాజాగా రైల్వే శాఖ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర. ఇక్కడ 39 కరోనా కేసులు నమోదయ్యాయి.. ఈ స‌మ‌యంలో ఇంకా ఎవ‌రైనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంది అని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు., ఇక తాజాగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. పశ్చిమ రైల్వేలో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం 250 రైల్వే స్టేషన్లలో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు.ఇందులో సికింద్రాబాద్ స్టేష‌న్ కూడా ఉంది.