కరోనా ఎంత దారుణం చేసిందంటే ఇలా కూడా సోకుద్దా

కరోనా ఎంత దారుణం చేసిందంటే ఇలా కూడా సోకుద్దా

0
86

కరోనా మహమ్మారి అందరిని భయపెడుతోంది, దీనికి కులం మతం అనే భేదాలు ఏమీ లేవు .. అందరికి ఇది సోకుతోంది. చిన్నపిల్లల పై ఇది అంత ప్రభావం చూపించదు అని అనుకున్నారు.. కాని ఇది చిన్నపిల్లలపై పసిపాపలపై కూడా ప్రభావం చూపిస్తోంది..

తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో నెల కూడా నిండని పసికందుకు కరోనా సోకింది. ఆ పసికందు వయసు కేవలం 23 రోజులే. ఆ శిశువు తండ్రి, నాయనమ్మ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో వారి కుటుంబమే కాదు ఏకంగా దేశం షాక్ అయింది.

ఇలా చిన్నారులకు కూడా ఈవైరస్ సోకుతోంది.. అయితే కుటుంబంలో వారికి వైరస్ సోకింది అనే విషయం తెలియదు.. కాని ఇంత చిన్నపాపకు సోకడంతో కుటుంబం కూడా బాధలో ఉంది.
ఢిల్లీలో ఇటీవల మర్కజ్ కు వెళ్లొచ్చిన వారి ద్వారానే ఈ ముగ్గురికి కరోనా వైరస్ సంక్రమించినట్టు భావిస్తున్నారు. వెంటనే వీరిని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. జిల్లా అధికారులు.