కరోనా సమయంలో మొత్తం మన భారత దేశం లాక్ డౌన్ లో ఉంది.. ఈ సమయంలో ఎవరిని బయటకు రావద్దు అని కేంద్రం కూడా తెలిపింది, ముఖ్యంగా చాలా మంది పోకిరీలు బైక్ లు కార్లు వేసుకుని ఈ సమయంలో బయటకు వస్తున్నారు… వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
బైక్ కార్లు సీజ్ చేస్తున్నారు.. ఇక లాక్ డౌన్ ఉల్లంఘిస్తే వారికి రెండు సంవత్సరాల జైలుశిక్ష అని కూడా చెబుతున్నారు, బయటకు వస్తే ప్రమాదం అని తెలిసి కూడా ఇలా లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోని ఓ వ్యక్తిపై అతని కొడుకే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిజంగా ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యపోయారు.ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఈ ఘటన జరిగింది.
అభిషేక్ ఓ ఆటోమొబైల్ కంపెనీలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో అతని కుటుంబం అంతా ఇంటికే పరిమితమయింది..తండ్రి వీరేందర్ సింగ్ మాత్రం బయట తిరుగుతున్నాడు. తండ్రి నిత్యం బయట ఖాళీగా తిరుగుతున్నాడు చెప్పినా వినిపించుకోవడం లేదు.. వారిని తిడుతుఉన్నాడు, దీంతో వెంటనే తండ్రిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు, పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.