కరోనా గురించి ప్రభుత్వానికి కీలక సూచన చేసిన ఆనంద్ మహీంద్రా

కరోనా గురించి ప్రభుత్వానికి కీలక సూచన చేసిన ఆనంద్ మహీంద్రా

0
137

మన దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి… దీంతో ఇటు డాక్టర్లు కూడా కొన్ని చోట్ల రోజూ 12 నుంచి 14 గంటలు పని చేస్తున్నారట, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరిస్దితి మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే దేశంలో 151 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ సమయంలో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించి తన భావం చెప్పే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక సూచన చేశారు కేంద్ర ప్రభుత్వానికి ..దేశంలో పెద్ద ఎత్తున ఈ కరోనా వైరస్ టెస్టింగ్ ప్రక్రియ
సాగుతోంది, అయితే ఇందులోకి ప్రైవేట్ సెక్టార్ ను కూడా అనుమతించాలని కోరారు.

వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ… ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కరోనా పరీక్షలను తక్కువగా చేసిందని వ్యాఖ్యానించారు. ముందు దీనికి ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ లే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఈ టెస్టులు చేస్తే వారి సర్వీస్ ఉపయోగించుకుంటే ఈ వైరస్ ఎవరికి ఉందో తొందరగా గుర్తించవచ్చు అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు ట్విట్టర్ ద్వారా విన్నివించారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.