కరోనా కాదు ఆ భయం చంపేస్తోంది సీనియర్ డాక్టర్ మాటలు వినండి

కరోనా కాదు ఆ భయం చంపేస్తోంది సీనియర్ డాక్టర్ మాటలు వినండి

0
90

చాలా మంది కరోనా వచ్చిన తర్వాత భయంతోనే ఎక్కువగా మరణిస్తున్నారు, ఈకరోనా ఏం చేస్తుంది అనే భయం చాలా మందిని వేధిస్తోంది….ముఖ్యంగా చాలా మంది ఇంట్లో ఉండి యూ ట్యూబ్ టీవీల్లో అనేక వార్తలు చూస్తున్నారు చదువుతున్నారు, దీని వల్ల భయం పెరిగిపోతోంది.

 

ఇలాంటివి చూడటం వల్ల సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి యాంగ్జయిటీ, డిప్రెషన్, కు లోనవుతున్నారు, ఈ భయం వారిలో ఉండి నిద్ర లేమి సమస్య వస్తోంది, ఆందోళన విపరీతంగా వస్తోంది.. ఇవన్నీ మనిషిని మరింత కుంగదీస్తాయి. భయం వేసినప్పడు మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.

 

ఈ హార్మోన్స్ విడుదలైనప్పుడు మన గుండె హార్ట్ బీట్ పెరుగుతుంది. బీపీ పెరుగుతుంది, అందుకే ఇలాంటి వార్తలు చూడకండి మీరు వీలైనంత జాగ్రత్తలు తీసుకోండి.. సాధారణ వార్తలు చూడండి ఈ కరోనా గురించి భయం కలిగే వార్తలు చూడద్దు అని తెలిపారు… అంతేకాదు బీపీ షుగర్ సమస్య ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి …ఇలాంటి టెన్షన్ వచ్చే వార్తలు చూడవద్దు అంటున్నారు డాక్టర్లు..

ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంటే కోవిడ్ సోకే అవకాశం తక్కువ అని చెబుతున్నారు.