ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై అందరూ పోరాటం చేస్తున్నారు… వాస్తవంగా దీనిని యుద్దమే అని చెప్పాలి… ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. లేకపోతే ఈ వైరస్ సులువుగా వస్తుంది అని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది, ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్నవారు ఎవరికి వారు పోలీసులకు జిల్లా వైద్య అధికారులకి సమాచారం అందిస్తున్నారు.
ఈ సమయంలో చాలా వరకూ విరాళాలు కూడా ప్రముఖులు అందిస్తున్నారు.. ఇతర దేశాల నుంచి మన దేశానికి అలాగే మన దేశం నుంచి ఇతర దేశాలకు కూడా విరాళాలు అందచేస్తున్నారు.
అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యనాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ను లీడ్ చేస్తున్నారు… ఆయన భార్య అనుపమ తెలంగాణ ప్రభుత్వానికి 2 కోట్ల విరాళం ప్రకటించారు.
ఇక ఆయన అమెరికాలోనే ఉన్నారు, తాజాగా అనుపమ తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కేసీఆర్ కి చెక్కు అందజేశారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ఈ చెక్కును వారు అందజేశారు.