కరోనా ముసుగులో నిలువుదోపిడీలు…

కరోనా ముసుగులో నిలువుదోపిడీలు...

0
123

ఒక వైపు కరోనా మహమ్మారి వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా మరోవైపు ఆ వ్యాధి ముసుగులో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే బాధితులనుంచి ముక్కుపిండి మరీ లక్షల్లో వసూల్లూ చేస్తున్నాయి..

తమకు కూడా ఎక్కడ కరోనా వచ్చిందోనన్న భయంతో కొంతమంది అర్థిక స్థితిమంతులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో వాళ్ల భయాన్ని సదరు యాజమాన్యాలు దర్జాగా క్యాష్ చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు… కరోనా వైరస్ సోకిన సోకుతున్నా ముందు జాగ్రత్త చర్యలు పీపీకిట్లు ఆసుపత్రి రోజువారి చార్జీలు పలు కరాలు పరీక్షలతో తమను ఆశ్రయించే బాధితులను జలగల్లా పీక్కుతింటున్నారు…

ఒకవేళ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా బాధితుల నుంచి రెండు మూడు లక్షల మేర స్వాహా చేసిన తర్వాతే ఇక దయచేయండీ పంపుతున్నారు… ఒకవేళ పాజిటివ్ వస్తే డాక్టర్ల దోపిడికీ బాధితుల కొంపకొల్లేరు అయినట్లే…