కరోనా నివారణకు సీఎం సహయనిధికి లోకేష్ భారీ సాయం

కరోనా నివారణకు సీఎం సహయనిధికి లోకేష్ భారీ సాయం

0
78

దేశంలోనే ఇప్పుడు కరోనా మహమ్మారి గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు, ఈ సమయంలో కరోనా వ్యాధి మరింత పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ, దీంతో ఎక్కడి వారు అక్కడే ఇంటి నుంచి బయటకు రాకుండా దాదాపు 21 రోజులు ఇంటిలోనే ఉండాలి.

ఈ సమయంలో చాలా మంది సీఎం సహయనిధికి విరాళాలు అందిస్తున్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు విరాళాలు అందించారు హీరో నితిన్ కూడా అందించారు, తాజాగా ఏపీలో తెలుగుదేశం పార్టీ సీఎం సహయనిధికి విరాళాలు అందించాలి అని డిసైడ్ అయింది.

తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ ఈ విషయం తెలిపారు. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తమ అధినేత చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని టీడీఎల్పీ సభ్యులు నెల వేతనాన్ని కరోనా సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. కుటుంబం తరపున కరోనా నివారణకు రూ 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు కుటుంబం.