కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన వారు ఇవి పాటించండి – కేంద్రం

కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన వారు ఇవి పాటించండి - కేంద్రం

0
116

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రివకరీ రేటు కూడా బాగానే ఉంది, అయితే కరోనా సోకి డిశార్జ్ అయిన వారు కచ్చితంగా మరో 15 రోజులు ఇంట్లో ఉండాలి.. దీని వల్ల వారికి మంచిది అలాగే ఈ వైరస్ పూర్తిగా తగ్గిందా లేదా అనేది కూడా వారికి తెలుస్తుంది.

అయితే కేంద్రం తాజాగా పలు గైడ్ లైన్స్ ఇచ్చింది..కోవిడ్-19 నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పింది. ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటివి వారిలో కనపడతాయని తెలిపింది.ఇక కోలుకుని ఇంటికి వచ్చిన వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి ఆహారం తీసుకోవాలి
ఇమ్యునిటీ పుడ్ తీసుకోవాలి
శారీరక వ్యాయామం చాలా అవసరం
వైద్యుడిని పదిహేను రోజుల తర్వాత తప్పక కలవండి
శ్వాస సంబంధ సమస్యలు ఉంటే వెంటనే కలవాలి
ఇక మంచి నిద్ర ఉండాలి
వేడినీరు మాత్రమే తాగాలి.
శానిటైజర్ వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలి
మాస్క్ మాత్రం కచ్చితంగా వాడాలి.