కరోనా పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు….

కరోనా పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు....

0
101

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు…

ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతుంటే జగన్ మోహన్ రెడ్డి మాత్రం భయపడాల్సిన పనిలేదని అంటున్నారని మండిపడ్డారు… దీనిబట్టి చూస్తుంటే ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ కు ఎంత శ్రద్ద ఉందో అర్ధం అవుతుందని అన్నారు యనమల…

రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యనమల… వైసీపీ నేతలు కరోనాను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు..