మన దేశంలో కొందరు పాజిటీవ్ అయినా నెగిటీవ్ అయినా దానికి సంధింగ్ జోడించాలని ..దానిని మార్కెట్ చేసుకోవాలి అని అనుకుంటారు, అందరూ ఇలా ఉండరు లేండి, ఇప్పుడు కరోనా మన దేశాన్ని పట్టిపీడిస్తోంది, ఈ సమయంలో చాలా మంది గో కరోనా గో అంటూ దీని వ్యాప్తి పెరగకూడదు అని ఇంటి పట్టునే ఉంటున్నారు.
దేశం యావత్తు లాక్ డౌన్ లో ఉంది. ఈ సమయంలో ఓ మిఠాయి వ్యాపారి మాత్రం డిఫరెంట్ గా ఏమైనా చెయ్యాలి అని అనుకున్నాడు , ఇప్పటికే మనం క్రోన్ మోడల్స్ లో కరోనాకి సంబంధించి అనేక ఫోటోలు చూస్తున్నాం, అచ్చం అలాగే ఓ స్వీట్ తయారు చేశాడు.
జనాలు దీనిని తెగ కొంటారు అని అనుకున్నాడు..కరోనా వైరస్ లాగా పైన బుడిపెలు కూడా పెట్టాడు, కాని వాటిని జనాలు కొనలేదు. ఈ స్వీట్లని చూసి ఫోటోలు తీసుకున్నారు, దీనిపై పోస్టులు పెట్టారు, ఇదేం స్వీట్ అని విమర్శించారు, పాపం ఒక్క స్వీట్ కూడా అతను సేల్ చేయలేదట, దీంతో దానిని షాపు నుంచి తీసేశాడు.