కరోనాపై పోరుకి రామోజీరావు విరాళం ఎంత ఇచ్చారంటే

కరోనాపై పోరుకి రామోజీరావు విరాళం ఎంత ఇచ్చారంటే

0
98

కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది.. దేశంలో ఇది పంజా విసురుతోంది.. రోజుకి రెండు వందల నుంచి మూడు వందల పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి, ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వందకు చేరువలో ఉన్నాయి కరోనా కేసులు.. వీటిని తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు.

ఇక తాజాగా విరాళాలు కూడా ప్రభుత్వానికి అందిస్తున్నారు చాలా మంది దాతలు.. ఈ సమయంలో
రామోజీ గ్రూప్స్ కూడా కరోనాపై పోరు కోసం తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున.. మొత్తం రూ.20 కోట్ల విరాళం అందించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధి ఖాతాలకు బదిలీ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు లేఖలు కూడా రాశారు.

మీరు ఈ యుద్దంలో విజయంసాధించాలి అని తెలిపారు రామోజీరావు సాయం పై సీఎం జగన్ ఆయనకు
ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని తెలిపారు.