Flash: బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్

0
85

తెలంగాణలో మళ్లీ కరోనా టెన్షన్ నెలకొంది. సామాన్యుల నుండి రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా మహమ్మారి పీడ అందరిని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రెటీలకు, నాయకులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కాగా..తాజాగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా కరోనా భారీన పడ్డారు.

స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హెం ఐసోలేసన్‌కు వెళ్లారు. ఇటీవలే బేగంబజార్ డివిజన్లోని సిసి రోడ్డు, స్టోమ్ వాటర్ పైప్ లైన్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనగా..ఈ మధ్య ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేసుకుంటే మంచిదని సూచించారు.