తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆయన పరీక్షలు నిర్వహించుకోగా…కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎర్రబెల్లి… హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇటీవల వారం రోజులు మంత్రులు, ఎంపీల బృందంతో కలిసి దిల్లీలో పర్యటించిన ఆయన నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అస్వస్థత వల్ల కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయన కరోనా పాజిటివ్ ఉందని తేలింది.