Flash: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

0
79

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కోవిడ్ బారిన పడగా..తాజాగా ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. కాగా ఇటీవల తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.