అమెరికా ఆరోగ్య మంత్రికి మరోసారి కరోనా పాజిటివ్..

0
110

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సామాన్యుల నుండి రాజకీయనాయకుల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరిని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి భారీన ఎంతోమంది పడగా..తాజాగా  అమెరికా హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్  నిర్వహించిన కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌లో ఇటీవల జరిగిన కాంట్రవర్షియల్ సమావేశం ‘సమిట్ ఆఫ్ ది అమెరికాస్’లో పాల్గొన్నారు. ఆ తర్వాత శాక్రమెంటోలో బెకెర్రాకు చేసిన యాంటీజెన్ టెస్టులో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

కానీ  బెకెర్రా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్న కారణంగా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేకూరే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనలో చాలా మైల్డ్ కరోనా లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని  వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బెకెర్రా ఐసోలేషన్‌లో ఉన్నారని, అక్కడి నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం తెలుస్తుంది.