షాకింగ్ న్యూస్… తల్లికి కరోనా నెగిటివ్ అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్…

షాకింగ్ న్యూస్... తల్లికి కరోనా నెగిటివ్ అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్...

0
91

మనదేశంలో కరోనా దండయాత్ర కొనసాగుతోంది… దీన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటీకి ఈ మాయదారి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది… దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి…

తాజాగా నగరానికి చెందిన ఒక గర్భణీ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కరోనా వైరస్ తో చేరింది… ఆమె భర్తకు కరోనా రావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నాడు… ఈ క్రమంలో ఆమెకు మరోసారి వైద్యులు పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలిది…

ఆమరుసటి రోజే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది… బిడ్డ పుట్టిన ఆరుగంటల తర్వాత కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్ తీసుకున్నారు.. ఆ శాంపిల్స్ లో బిడ్డకు కరోనా పాజిటివ్ అని తేలింది.. దీంతో డాక్టర్లందరు ఆశ్చర్యపోయారు… అయితే పిల్లలకు బొడ్డుతాడు ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు…