కరోనా రూల్స్ పాటించని మంత్రులకి స్పీకర్ స్వీట్ వార్నింగ్ ..

కరోనా రూల్స్ పాటించని మంత్రులకి స్పీకర్ స్వీట్ వార్నింగ్ ..

0
101

కరోనా నియంత్రణ నియమేలు ఎవరికైనా ఒక్కటే అన్న నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది . ఇప్పటికే కరోనా కట్టడి విషయం లో అపఖ్యాతి మూట కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చాల జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కంట్రోలింగ్ కోసం కఠినంగా వ్యవహరిస్తోంది .

అయితే ఈ నేపథ్యం లో తెలంగాణ అసెంబ్లీ లో ఇద్దరు మంత్రులు సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టారట . ఈ విషయం గమనించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆ మంత్రులతో ప్రజలకి చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులే నో సీటింగ్ లో కూర్చోవటమేంటని అయన వాళ్ళని ప్రశ్నించారట .దీనితో అసెంబ్లీ మొత్తం ఒక్కసారిగా అలెర్ట్ అయిందట .

అయితే ఈ మధ్య డిప్యూటీ స్పీకర్ పద్మాకర్ గౌడ్ విషయం లోను ఇలాగె జరిగింది ,ఓ సమావేశం లో అయన మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరించారు … ఇది జరిగిన రెండు రోజులకే ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది .అందుకే దయచేసి ఎవరు నియమాల విషయం లో నిర్లక్ష్యం చెయ్యొద్దని అధికారులు చెబుతున్నారు .