క‌రోనా స‌మ‌యంలో అప‌ర‌కబేరుడు అయిన ఈ వ్యాపారి ఎలాగంటే

క‌రోనా స‌మ‌యంలో అప‌ర‌కబేరుడు అయిన ఈ వ్యాపారి ఎలాగంటే

0
78

క‌రోనా దెబ్బ‌కు అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు, ఈ స‌మ‌యంలో బ‌య‌ట‌కు రాని ప‌రిస్దితి, ఎవ‌రికి ఉపాది లేదు ఉద్యోగాలు లేవు, అయితే కొంద‌రు వ్యాపారులు అస‌లు నెల‌నుంచి వ్యాపారం కూడా చేయ‌ని స్ధితి, అయితే తాజాగా మెడిక‌ల్ కు సంబంధించి వ్యాపారాలు ప‌రిశ్ర‌మ‌లు మాత్రం బాగా ర‌న్ అవుతున్నాయి.

సింగపూర్ కు చెందిన షెంజెన్ మైండ్‌రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ లి జిటింగ్ కరోనా వైరస్ సంక్షోభంతో అప‌ర‌కుబేరుడు అయ్యారు, ముఖ్యంగా ఈ కంపెనీ వెంటిలేట‌ర్లు ప‌లు వైద్య కిట్లు త‌యారు చేస్తుంది, ఈ క‌రోనా స‌మ‌యంలో ఆ కంపెనీ 24 గంట‌లు ప‌ని చేస్తోంది, దాదాపు
100 దేశాల నుంచి వారికి ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి.

చైనా లో జన్మించిన జీ లిటింగ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్ కేంద్రంగా విస్తరించారు. అయితే కరోనా దెబ్బతో ఆయన ప్రస్తుతం సింగపూర్‌లో అత్యంత సంపన్నుడిగా మారాడు. ఇక ఆయన కంపెనీ విలువ భారీగా పెరిగింది, షేర్ వాల్యూ 50 శాతం పెరిగింది…ఒక్కసారిగా రూ.32,777 కోట్లు నుంచి రూ.1,02,905 కోట్లకు పెరిగింది ఆయ‌న సంప‌ద‌. అంతేకాదు ఆయ‌న గంట‌కు 12 కోట్లు సంపాదిస్తున్నార‌ట‌