కరోనా తగ్గుతుంది అని ఈ ట్యాబ్లెట్స్ తెగ వేసుకుంటున్నారట నో స్టాక్ బోర్డులు

కరోనా తగ్గుతుంది అని ఈ ట్యాబ్లెట్స్ తెగ వేసుకుంటున్నారట నో స్టాక్ బోర్డులు

0
81

కోవిద్-19 యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది, కేసుల సంఖ్య కూడా దాదాపు 34 లక్షలకు చేరుకుంది, ఈ సమయంలో కేసులు పెరగడంతో ఎక్కడడికక్కడ లాక్ డౌన్ పాటిస్తున్నారు, అయితే ఈ వైరస్ కి ఇంకా మందు కనిపెట్టలేదు, వ్యాక్సిన్ కోసం అన్నీ దేశాలు పని చేస్తున్నాయి.

అయితే ఈ వ్యాధి చైనాలో తగ్గుముఖం పట్టింది.. అందుకే వ్యాధి తగ్గేందుకు చైనా… ఏయే మందులు వాడిందో… ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెగ కొంటున్నారు. ఫెమోటీడైన్ (Famotidine)… ఏ మందుల షాపులో ఉన్నా… వెంటనే కొనేస్తున్నారు, ఈ మందులు గుండెలో మంట, గ్యాస్ నొప్పి తగ్గించేవి ఇప్పుడు ఇవే తెగ కొంటున్నారట.

ఇవి రూపాయికి రెండు లేదా మూడు వస్తాయి. ఇంత తక్కువ రేటు అని చాలా మంది ఇవి కొని వాడుతున్నారట, అయితే డాక్టర్లు దీని గురించి తెలియచేస్తున్నారు, ఇది కరోనాకి తగ్గే మందు కాదని, కొందరికి మాత్రమే తగ్గింది అని తెలియచేస్తున్నారట, అమెరికాలాంటి దేశాలు మాత్రం ఈ మందు వాడుతున్నాయట, కొందరికి ఈ మందు పని చేస్తోందట, అందుకే దీనిపై పరీక్షలు జరుపుతున్నారు.