కరోనాతో నేపాల్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో- సాయం ప్లీజ్

కరోనాతో నేపాల్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో- సాయం ప్లీజ్

0
113

మన దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే, ఇక మన పొరుగు దేశం నేపాల్ ని కూడా కరోనా వెంటాడుతోంది,

 నేపాల్లో 47 శాతం పాజిటివిటీ రేటుతో భయం భయంతో ఉన్నారు అక్కడ జనం.. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.6 లక్షలకు, మరణాల సంఖ్య 3,529కి చేరుకుంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థనలు పంపుతుంది.

దేశంలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరతగా ఉంది. ఆస్పత్రి బెడ్లు సరిపోవడం లేదు. ఇక వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది, వందల మంది పేషెంట్లకు డాక్టర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక దేశ రాజధాని కఠ్మాండీతో పాటుగా పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.

ఇక అక్కడ ఒక్కో ప్రాంతంలో 250 మంది ఉంటే ఏకంగా అందులో 150 మందికి కేసులు బయటపడుతున్న పరిస్దితి..

ఆస్ట్రజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు దొరకడం లేదు. ఇక్కడకు టీకాలు కావాలి అని కోరుతున్నారు.

నేపాల్ లో సుమారు 3 కోట్ల జనాభా ఉంటారు, ఇంత మంది జనాభా ఉన్నా 1600 ఐసీయూలు, 600 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి.