కరోనాతో పాటు ఈ వ్యాధులు వస్తున్నాయి – వైద్యుల హెచ్చరిక

కరోనాతో పాటు ఈ వ్యాధులు వస్తున్నాయి - వైద్యుల హెచ్చరిక

0
88

ఈ కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది, ఇప్పటికే 40 లక్షల మందికి పాజిటీవ్ వచ్చింది.. మన దేశంలో రోజుకి 90 వేల కేసులు నమోదు అవుతున్నాయి, ఈ సమయంలో అనేక లక్షణాలు బయట పడుతున్నాయి. మరికొందరికి అసలు లక్షణాలే కనిపించడం లేదు.

అయితే తాజాగా ఢిల్లీ వైద్యులు మరో షాకింగ్ వార్త చెప్పారు. కరోనాతో బాధపడుతున్నవారికి డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సోకుతున్నట్లు గుర్తించామని తెలిపారు. పలువురు పేషెంట్లని గుర్తిస్తే వారికి ఈ వ్యాధులు కూడా ఉన్నాయి అని తేలిందట.

ఈ సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఆయా పరీక్షలు చేస్తే వారిలో చాలా మందికి కరోనాతోపాటు మలేరియా లేదా డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అక్కడ వైద్యులు వెల్లడించారు, తీవ్రమైన జ్వరం తగ్గకపోవడంతో పరీక్ష చేశాం వారికి డెంగ్యూ ఉంది… మరో 16 ఏళ్ల యువకుడికి టెస్ట్ చేస్తే అతనికి మలేరియా అని వచ్చింది..దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి, చెత్త చెదారం ఉంచకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు. రెండు రోజులకి జ్వరం తగ్గకపోతే అశ్రద్ద వద్దు వైద్యులని సంప్రదించండి.