క‌రోనాతో పాటు ఎయిడ్స్ ప‌రీక్ష‌లు సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనాతో పాటు ఎయిడ్స్ ప‌రీక్ష‌లు సంచ‌ల‌న నిర్ణ‌యం

0
85

ఇప్పుడు లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు, ఈ స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ కు సంబంధించి ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు చాలా మందికి జ‌రుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో కొన్ని సంస్ధ‌లు హెచ్ ఐ వీ ప‌రీక్ష‌లు కూడా చేస్తే ఈ ఇన్పెక్ష‌న్లు ఉన్న వారు బ‌య‌ట‌ప‌డ‌తార‌ని, వారికి చికిత్స అందించ‌వ‌చ్చు అని తెలియ‌చేస్తున్నారు.

ప‌లు దేశాల్లో చాలా మంది ఇప్పుడు ఇలాంటి టెస్టులు చేయించుకునేందుకు ముందుకు వ‌స్తున్నార‌ట‌, ఇక ఇంటిలో ఉండ‌టంతో ఇది త‌మ భాగ‌స్వామికి వ‌స్తుంది అనే భ‌యంతో చాలా మంది చేయించుకుంటున్నారు‌, కాని కౌన్సిల్ మాత్రం ఇలా చేయ‌డం వ‌ల్ల క‌చ్చితంగా చాలా మంది ఎయిడ్స్ పేషెంట్ల‌ని గుర్తించి వారికి చికిత్స అందించ‌వ‌చ్చు అని చెబుతున్నారు.

మొత్తానికి కొన్ని దేశాలు ప్ర‌యోగాత్మ‌కంగా ఆలోచన‌ చేస్తున్నాయి, మ‌రి‌కొంద‌రు మాత్రం ఈ క‌రోనా స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం అన‌వ‌స‌రం అంటున్నారు, మొత్తానికి చాలా మంది పురుషులు మాత్రం త‌మ పార్ట‌న‌ర్ కు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ఈ టెస్టులు చేయించుకుంటున్నార‌ట స్వ‌తహాగా‌.