ఈ లాక్ డౌన్ వేళ రోడ్లపై చిరు తిళ్లు కూడా ఎవరూ అమ్మడం లేదు ,పూర్తిగా టిఫిన్స్ బజ్జీ బళ్లు ఇలా ఏమీ కూడా తెరచుకోవడం లేదు, హోటల్స్ లో కూడా పార్శిల్ సర్వీసులు మాత్రమే , అయితే ఈ వైరస్ వేళ నిన్న రంజాన్ కావడంతో ఓ పానిపూరీ బండి వచ్చింది, ఇక చిన్నా పెద్ద అందరూ ఆ పానీపూరీ తిన్నారు, అదే వారి కొంప ముంచింది.
ఆదిలాబాద్లో ఈ ఘటనే జరిగింది. పట్టణంలోని ఖుర్షీద్ నగర్లో ఓ పానీ పురి బండి వద్ద పానీపురి తిన్న 30 మంది అస్వస్థతకు గురయ్యారు. కాలనీలోకి పానీపురి బండి రావడంతో రంజాన్ సందర్భంగా చిన్నా పెద్దా అంతా కలిసి పానీపురి తిన్నారు. తిన్నా గంటకి పిల్లలకు పెద్దలకు వాంతులు అయ్యాయి, కొందరికి విరోచనాలు అయ్యాయి.
దీంతో అందరూ ఆస్పత్రికి పరుగులు తీశారు, వారికి రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు..ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఫుడ్ ఇలా బయట ఏమీ తినద్దు అని చెబుతున్నారు వైద్యులు, కొద్ది రోజులు బయట ఫుడ్ కి దూరంగా ఉండండి.