కరోనా టైమ్ లో వైసీపీకి బారీ క్రేజ్.. పోటీకి నో అంటున్న తమ్ముళ్లు

కరోనా టైమ్ లో వైసీపీకి బారీ క్రేజ్.. పోటీకి నో అంటున్న తమ్ముళ్లు

0
132

కరోనా వైరస్ విజృంభనతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నగరంలో నిలిచిపోయింది. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఏకగ్రీవాలు కూడా తేలిపోవడంతో మున్సిపాల్టీల పరిస్థితి, పంచాయతీల విషయంలో తొలి ఘట్టం ఇంకా మొదలు కాలేదు… ఈ లోపే కరోనా రావడంతో ఎన్నికలు వాయిదా పడటం కమిషనర్ మారిపోవడం అన్నీ జరిగిపోయాయి…

సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.. అయితే సరిగ్గా అదే సమయానికి టీడీపీ అస్త్ర సన్యాసం చేసింది… కరోనా కష్టకాలంలో తమ్ముళ్ళు ఇళ్లకే పరిమితం అయ్యారు కనీసం ఎమ్మెల్యే కూడా సహాయ కార్యక్రమాల కోసం బైటకు రాలేదు… సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు… ఏపీ టీడీపీ నేతలు పేదలకు సాయం అనే మాటను పక్కన పెట్టేశారనే పేరు తెచ్చుకున్నారు…

ఇక మరోవైపు వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానిక సంస్థల అభ్యర్థులు సహాయ కార్యక్రమాల్లో దూసుకువెళ్తున్నారు… దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి…కారోనా కష్ట కాలంలో దీన్ని రాజకీయ కోణంలో చూడలేము కానీ వారికి అలా కలిసొచ్చింది… ఏకగ్రీవంగా నెగ్గిన అభ్యర్థులు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారుదీంతో టీడీపీ నేతలు ఆలోచనలు చేస్తున్నారట… స్థానికి సంస్థల్లో పోటీ చేసినా తమ పప్పులు ఉడకవనే అంచనాకువస్తున్నారట…