ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది… రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతూన్నారు… ఇక స్కూళ్లు లేక పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.. కరోనా విజృంభనతో స్కూల్స్ అన్ని మూత పడ్డాయి… ఇప్పుడు స్కూల్స్ తెరిస్తే బాగుంటుందని అందరు భావిస్తూనే వారిలో మరో భయం మొదలు అవుతోంది..
స్కూల్స్ లో పిల్లలు అందరు దగ్గర దగ్గర కూర్చుంటారు… దీంతో ఎక్కడ తమ పిల్లలకు కరోనా వైరస్ వస్తుందోనని భయపడతున్నారు తల్లిదండ్రులు… అయితే అలాంటి భయాన్ని పోగట్టడానికి ఒక మాస్టార్ మాస్టర్ ప్లాన్ వేశాడు…
పిల్లలకు కొత్త తరగతుల వాతావరణాన్నిఅలవాటు చేయడానికి వినూత్న ఐడియాతో ముందుకు వచ్చారు… తరగతి గదిని ఒక రైలులా కనిపించేలా అలంకరించారు… ఈ గది సామాజిక డిస్టెన్స్ ఉండేలా చేశారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…