ప్రపంచాన్ని గడగడ వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ ను నిర్మూలించడానికి కనిపెట్టిన మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది… ఫస్ట్ బ్యాచ్ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మార్కెట్ లో అడుగు పెట్టింది…
ప్రజల అవసరాల కోసం దీన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు… రష్యా దీన్ని తయారు చేసింది… స్పుత్నిక్ వీ ఫ్టస్ బ్యాచ్ వ్యాక్సిన్ ను బహిరంగంగా మార్కెట్ లోకి విడుడల చేసినట్లు రష్యా ప్రకటించింది… ఈ మేరకు అదేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు…
రాజధాని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిక్ ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ ను విడుదల చేశాడు… కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన మొట్టమొదటి దేశంగా రష్యా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.