బ్రేకింగ్ – నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ రాష్ట్రాల‌కు ఆదేశాలు ఏర్పాట్లు చేయండి

బ్రేకింగ్ - నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ రాష్ట్రాల‌కు ఆదేశాలు ఏర్పాట్లు చేయండి

0
92

సెప్టెంబ‌ర్ వ‌చ్చేసింది, ఇక జ‌స్ట్ రెండు నెల‌లు, ఇక క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది, దీనికి సంబంధించి అగ్ర‌రాజ్యం అమెరికా చెప్పిన‌ట్లే ముందుకు సాగుతోంది, అంతేకాదు అన్నీ రాష్ట్రాల అధికారుల‌కి లేఖ‌లు రాశారు, ఇక వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలి అని చెబుతున్నారు.

ఇక అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్రాలకు సందేశం వచ్చింది.
డల్లాస్ బేస్డ్ హోల్ సేలర్ మెక్ సన్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్నారు, అయితే వీరు అన్నీ స్టేట్స్ కు ఈ వ్యాక్సిన్ ని పంపిణీ చేయ‌బోతున్నారు.

దీనికి కా‌వాల్సిన అన్ని ఏర్పాట్లు ఈరెండు నెల‌ల కాలంలో ఏర్పాటు చేసుకోవాలి అని ట్రంప్ స‌ర్కారు తెలిపింది..దీంతో ఈ వ్యాక్సిన్ పంపిణీకి అక్క‌డ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నా‌రు, న‌వంబ‌ర్ 1 నుంచి వ్యాక్సిన్ క‌చ్చితంగా అందిస్తాము అని అమెరికా చెబుతోంది, అయితే చేస్తున్న ప్ర‌యోగాలు స‌క్సెస్ అవుతున్నాయి, వాలంటీర్ల ఆరోగ్యంగా ఉన్నారు.

దీంతో అమెరికా ఆనందంలో ఉంది, తొలి డోస్ టీకా తీసుకున్న కొన్ని వారాల తర్వాత రెండో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు, ఇక ముందుగా అమెరికా ప్ర‌భుత్వం అక్క‌డ ఉన్నత అధికారుల‌కి ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కి ఉద్యోగుల‌కి ఇవ్వ‌నున్నారు టీకా, త‌ర్వాత దేశంలో అంద‌రికి పంపిణీ చేయ‌నున్నారు.