దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు అందరూ వేయించుకుంటున్నారు, ముఖ్యంగా చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. వైద్యులు కూడా అనేక విషయాలు చెబుతూ ఆ ప్రశ్నలని నివృత్తి చేస్తున్నారు… అయితే అందరూ ఒకటే ప్రశ్న ఎలాంటి ఆహారం టీకా తీసుకుంటే తినాలి అని అడుగుతున్నారు.. అయితే వైద్యులు దీనికి కొన్ని విషయాలు చెబుతున్నారు.
కరోనా టీకా వేసుకున్న ఎవరు అయినా కచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. లేత కూరగాయాలు ఆకుకూరలు పచ్చి కూరగాయలు వండుకుని తినాలి, ఊరగాయలు పచ్చళ్లు జోలికి వెళ్లకండి కొద్ది రోజులు, ఇక ఆకుకూరలు చేపలు పండ్లు తాజా పండ్ల రసాలు షుగర్ లేకుండా తీసుకోవచ్చు.
ఇక మీరు పసుపు రోజు కొద్ది మొత్తంలో ఆహారంలో ఉండే విధంగా చూసుకోండి, పాలల్లో అయినా గోరు వెచ్చని నీటిలో అయినా వేసుకుని తాగండి.. కాలి కడుపుతో వాక్సిన్ తీసుకోవద్దు ఏదో ఓ ఆహారం తీసుకుని వెళ్లండి. ఇక వాక్సిన్ వేసుకున్న తర్వాత ఓ అరగంట లేదా గంటకి నీరు రెండు మూడు గ్లాసులు తీసుకోండి ..డ్రింకులు ఎనర్జీ డ్రింకులు ఇలాంటివి తాగకండి . మద్యానికి దూరంగా ఉంటేనే మంచిది.