ఉరుకులు పరుగుల ప్రపంచం ఇది అయితే కరోనా వైరస్తో దారుణంగా ప్రభావం పెరిగిపోయింది, ఇక ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా గురించి చర్చ జరుగుతోంది. ఇక పరిశ్రమలు వ్యాపారాలు ఏమీ రన్ అవడం లేదు.
తాజాగా ప్రపంచం లాక్ డౌన్ లో ఉంది, ఇక ఈ సమయంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెలకిందట వరకు రణగొణ ధ్వనులతో ఉన్న ప్రపంచం ఇప్పుడు సైలెంట్ గా మారింది., భూమి నుంచి వచ్చే సూక్ష్మ కంపన శబ్దాలు కూడా ఎన్నడూ లేనంతగా తగ్గాయని వివరించారు.
అయితే అన్నీ రన్ అయి ప్రపంచంలో పరిశ్రమలు ధ్వనులు ఉంటే కచ్చితంగా ఈ కంపన శబ్దాలు ఎక్కువ ఉండేవి. ఇక కంపెనీలు పరిశ్రమలు పని జరగకపోవడం వాహనాలు తిరగకపోవడం జనం ఇంటి దగ్గర ఉండటంతో ధ్వని తీవ్రత తగ్గేందుకు కారణాలయ్యాయని పరిశోధకులు తెలిపారు. భూమి నుంచి వచ్చే ధ్వనుల్లో 30 నుంచి 50 శాతం తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు.