కరోనా వేళ భారత్ కు మరో గండం

కరోనా వేళ భారత్ కు మరో గండం

0
94

అతి దారుణంగా కోట్లాది మిడతలు భారత్ పై దాడి చేస్తున్నాయి, మనకు అన్నం పెట్టే రైతన్న పొట్ట కొడుతున్నాయి, మనకు ధాన్యరాశిని పంటలను నాశనం చేస్తున్నాయి..ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాకిస్తాన్ మీదుగా భారత్లోకి వచ్చిన మిడతల దండు పంటలను నాశనం చేస్తోంది.

ఏకంగా ఒక చదరపు కిలోమీటర్ లో ఇవి 80 మిలియన్ల వరకూ ఉంటాయి అని అంటున్నారు, ఇలా వందల గుంపులు వస్తున్నాయి ఇవన్నీ ఏకంగా రాష్ట్రాల పైనే అటాక్ చేస్తున్నాయి. మన దేశంలో రాజస్తాన్,గుజరాత్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రల్లో వీటివల్ల తీవ్ర పంటనష్టం వాటిల్లుతోంది. మన దేశంలో 27 సంవత్సరాల్లో ఇలాంటి దాడి ఎన్నడూ జరగలేదు.

పాకిస్తాన్ నుంచి భారత్కు వలసొచ్చిన ఈ మిడతల దండు పొడవు సుమారు 2కి.మీ నుంచి 3కి.మీ పొడవు ఉంది. గతేడాది ఇరాన్ నుంచి బయలుదేరినవిగా చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి పెసర, పప్పు, పత్తి, గోదుమ పంటలపై దాడి చేస్తున్నాయి.రాజస్తాన్లో దాదాపు 5లక్షల హెక్టార్లలో పంటను మిడతలు నాశనం చేశాయి. వీటిని ఎలాగైనా నాశనం చేయాలి అని రైతులు గగ్గోలు పెడుతున్నారు.