కరోనా వైరస్ మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందుతోంది…6400 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అత్యంత దారుణంగా ముంబైలో ఉంది పరిస్దితి, ఇక మహరాష్ట్ర మొదటి వరుసలో ఉంది దేశంలో…ఇక్కడే అనేక కేసులు నమోదు అవుతున్నాయి… దేశ ఆర్దిక రాజధాని ముంబైలో దీని వ్యాప్తి మరింత పెరుగుతోంది.
అయితే ఇక్కడ మహారాష్ట్రలోని పుణే నగర పాలక సంస్థ తన ఉద్యోగులకు గట్టి భరోసా ఇచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల్లో పాల్గొనే ఉద్యోగులు ఆ వ్యాధి కారణంగా మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులకు రూ.1 కోటి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు అందరికి ఇది వర్తిస్తుంది.
చాలా వరకూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ రోడ్లపై ఉద్యోగాలు చేస్తున్నారు, అలాంటి వారి సాయం వెలకట్టలేనిది అని తెలిపారు పుణే నగర మేయర్… ఈ వ్యాధి వచ్చి ఎవరైనా దురదృష్టవశాత్తు ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబానికి కోటి ఆర్థిక సాయం పుణే నగర పాలక సంస్థ ఇస్తుందన్నారు.