కరోనా వైరస్ జన్మ స్థలం ఎక్కడో తెలుసా.. చైనా కాదట….

కరోనా వైరస్ జన్మ స్థలం ఎక్కడో తెలుసా.. చైనా కాదట....

0
99

చైనాలో హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్ నగరం నుంచి నోవెల్ కరోనా వైరస్ విశ్వవ్యప్తమైన విషయం తెలిసిందే అయితే ఆ ప్రాణాంతకరమైన వైరస్ జన్మ స్థలం ఎక్కడో చెప్పడం కష్టంగా ఉంది…

ఆ వైరస్ జన్యు మూలాలను గుర్తించక ముందే దాని గురించి స్పష్టమైన ప్రకటన చేయడం అవివేకమే అవుతుందని చైనా పేర్కొంది… ఆ దేశానికి చెందిన శ్వాసకోస వ్యాధుల నిపునుడు జంగ్ నాన్ షాన్ మీడియాతో మాట్లాడారు… నోవెల్ కరోనా వైరస్ వుహాన్ లో పుట్టిన విషయం వాస్తవమే అయినా అది అక్కడకు ఎలా వచ్చిందన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదని తెలిపారు…

వుహాన్ తొలి కరోనా లక్షణాలు గుర్తించినా అది ఆ నగరంలోనే పుట్టినట్లు లేవన్నారు… ఇది సైద్దాంతిక ప్రశ్న అని ఆయన అన్నారు… వైరస్ క్రమేనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరసు పుట్టుకకు సంబంధించిన లక్షణాలు బయటపడతాయని జాంగ్ తెలిపారు…