కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా

కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా

0
388

ఇప్పటివకు కరోనా వైరస్ ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు కేవలం ఒక రబ్బర్ పై చుట్టు రంధ్రాలు ఉన్న ఆకారంలో మాత్రమే చూపించారు… అయితే తాజాగా కరోనా వైరస్ ఎలా ఉంటుందో మన శాస్త్ర వేత్తలు కనుగొన్నారు… తాజాగా పూణె శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఫోటోను తీశారు….

ఈ వైరస్ ఎలా ఉంటుందో కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను ఉపయోగించారు… ఇటీవలే చైనా నుంచి భారత్ కు వచ్చిన కేరళ చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి.. భారత్ లో నమోదు అయిన తొలికేసులు ఇవే… వీరి నమూణాలను పూణెలోకి ప్రయోగశాలకు పంపారు..

ఆ నమూనాలనుంచి కరోనా కు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ గుర్తించి ఫోటో తీశారు…ఇది అచ్చం మెర్స్ కోవ్ వైరస్ ను పోలి ఉంది… ఈ వైరస్ చూడటానికి కిరీటంలా ఉంది అందుకే ఈ వైరస్ కరోనా అని పేరు పెట్టారు… కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం అని అర్థం అట… అందుకే ఈ వైరస్ కు కరోనా అనే పేరు పెట్టారు…