ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది ఎక్కడ చూసినా కేసులు పెరుగుతున్నాయి అగ్రరాజ్యం అమెరికా బ్రిటన్ ఇంకా ఈ కేసుల నుంచి బయటపడలేదు ఓ పక్క టీకా ఇస్తున్నారు మరో ఏడాది వరకూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు, అయితే చైనాలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
చైనాలో టియాన్జిన్ నగరంలో ఐస్ క్రీమ్ లో కరోనా వైరస్ క్రిములను గుర్తించారు. దాంతో ఆ బ్యాచ్ కు చెందిన ఐస్ క్రీమ్ బాక్సులన్నింటినీ కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది. అంతేకాదు అవి ఏ చిన్న షాపులో ఉన్నా వాటిని కూడా అమ్మడం లేదు అంతేకాదు అన్నీ స్టోర్స్ నుంచి వాటిని కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది.
ఇప్పటికే ఈకంపెనీ ఐస్ క్రీమ్ లో కరోనా క్రిములు వచ్చాయి అనే వార్త రావడంతో.. అసలు ఐస్ క్రీమ్స్ తినడం మానేశారు చాలా మంది. కంపెనీలో ఉద్యోగులు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో అధికార వర్గాలు దీనిపై ఆంక్షలు విధించాయి. అయితే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.