కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో రావటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో రావటానికి ఎన్నిరోజులు పడుతుందో తెలుసా

0
81

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి నెలల సమయం పట్టొచ్చని అన్నారు వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి. అప్పటి దాకా మనం చేయగలిగింది వ్యక్తిగత పరిశుభ్రత, బయటి వ్యక్తులకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తే వ్యాక్సిన్ వచ్చే లోగానే వైరస్ ను తరిమికొట్టొచ్చని తెలిపారు…

కరోనా ఆంక్షలను ప్రజలు తూచ తప్పకుండా పాటించాలని తెలిపారు. ఇది అరుదుగా వచ్చే విపత్తని అన్నారు దేశంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్రంగా ఏపీ ముందుందని తెలిపారు.

బయట తిరిగి పరిస్థితి చేయిదాటే విధంగా చేసుకోవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన సూచనలు పాటిస్తూ ఇళ్లలో ఉండి సమాజానికి మన వంతు తోడ్పాడునందించాలని తెలిపారు.