కరోనా వైరస్ వల్ల రైల్వే సంచలన నిర్ణయం రిజర్వేషన్ చేసుకున్నవారు ఇది తెలుసుకోండి

కరోనా వైరస్ వల్ల రైల్వే సంచలన నిర్ణయం రిజర్వేషన్ చేసుకున్నవారు ఇది తెలుసుకోండి

0
83

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది… రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి ,ఈ సమయంలో దేశంలో ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియచేస్తున్నారు..ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బోగీల్లో కర్టెన్లను తొలగించాలని, దిండ్లు, బెడ్ షీట్లను ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయించింది.

ఇప్పటికే ఏసీ కోచ్ లలో ప్రయాణం చేసే సమయంలో సకల సదుపాయాలు ఉంటాయి, ఈ సమయంలో వారికి దిండులు బెడ్ షీట్లు అన్నీ ఇస్తారు, కాని ఇప్పుడు మాత్రం అవేమీ కల్పించరు, ఎవరైనా కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి అవి వాడితే వాటి నుంచి ఏమైనా వైరస్ ప్రబలితే కష్టం అని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రైలు ఎక్కితే, కర్టెన్లు, బెడ్ షీట్ల ద్వారా అది ఇతరులకు సులువుగా వ్యాపించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అని తెలుస్తోంది, ఇక అన్ని రైల్వే జోన్లు దేశ వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయనున్నాయి అని తెలుస్తోంది.