కరోనా వ్యాధి వారికి కొత్త ల‌క్ష‌ణాలు – డాక్ట‌ర్లు హెచ్చ‌రిక‌

కరోనా వ్యాధి వారికి కొత్త ల‌క్ష‌ణాలు - డాక్ట‌ర్లు హెచ్చ‌రిక‌

0
132

చాలా మందికి కోరోనా విష‌యంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి, అయితే జ్వ‌రం జ‌లుబు ద‌గ్గు గొంతు నొప్పి వ‌స్తేనే క‌రోనా వ‌స్తుందా ? మ‌రే సింట‌మ్స్ క‌నిపించ‌వా అనే అనుమానం చాలా మందిలో ఉంది….ఇప్ప‌టి వ‌ర‌కూ వైద్యులు కూడా దగ్గు, జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా బాధితులుగా గుర్తిస్తున్నారు.

అయితే కరోనా బాధితుల్లో మరికొన్ని లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకపోయినా కొంతమంది కరోనా సోకితే వాసన లేదా రుచిని కోల్పోతున్నారని ప్రకటన చేశారు.
ఇది కంటి ద్వారా ముక్కు నోరు ద్వారా సులువుగా శ‌రీరంలోకి చేరుతుంది అని అంటున్నారు. ఇలా కొంద‌రు వాస‌న రుచి చూడ‌లేక‌పోతున్నార‌ట‌.

జ్వరం, దగ్గు లేకపోయినా దాదాపు 66 శాతం మంది రోగులలో రంగు, రుచి కోల్పోతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు, ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్నా అశ్ర‌ద్ద చేయ‌కండి అని చెబుతున్నారు, కేవ‌లం అవే ల‌క్ష‌ణాలు ఉండాలని లేదు.. మ‌నిషి శ‌రీరం పై ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ప్ర‌భావం ఉంటుంది.. అందుకే ఇలాంటి ప‌రిస్దితి ఉంటుంది అంటున్నారు.. అంతేకాదు చాలా మందికి విరోచనాలు కూడా మరో లక్షణమని అంటున్నారు.. ఇవి ఎక్కువ రోజులు ఉంటే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోండి.