కరోనాతో చనిపోయిన వారి మృతదేహలు ఇలాగే పూడ్చాలి – కేంద్రం

కరోనాతో చనిపోయిన వారి మృతదేహలు ఇలాగే పూడ్చాలి - కేంద్రం

0
129
Corona

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి, ఇప్పటికే దేశంలో ఇద్దరు ఈ కరోనా వైరస్ సోకి మరణించారు… కర్ణాటకలో కరోనా కారణంగా ఓ వృద్ధుడు మరణించాడు..దేశ రాజధాని ఢిల్లీలో 68ఏళ్ల ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందింది. ఇలా చూసుకుంటే వృద్దులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది అని తెలుస్తోంది.

అందుకే ఏదైనా వ్యాధులు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు డాక్టర్లు. ఇక కరోనా సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుపుతున్నారు వారి కుటుంబ సభ్యులు… అయితే ఈ సమయంలో ఆ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉందని చాలా మంది భయపడుతున్నారు.

కాని ఇలా చనిపోయిన వారి నుంచి ఆ వైరస్ ఎవరికి సోకదు అని చెబుతున్నారు వైద్యులు, శవం ద్వారా మృతదేహం నుంచి వైరస్ రాదు అని ప్రజలకు చెబుతున్నారు, తాజాగా దీనిపై కేంద్రం కొన్ని విషయాలు చెప్పింది. కోవిడ్ వైరస్ దగ్గు – తమ్ముల వల్ల బయటకు వస్తుందని.. ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తోందని తెలిపింది.. కచ్చితంగా శరీరాన్ని క్లాత్ తో చుట్టి దహనం ఖననం చేయవచ్చునని తెలిపింది.