సీఎం జగన్ తిట్ల పురాణం పై కౌంటర్ అటాక్

0
45

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడిన తీరును తీవ్రంగా విమర్శించాడు లక్ష్మి నారాయణ సామాజిక ఉద్యమకారుడు. “వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు” అంటూ ప్రతిపక్ష నాయకులను, మీడియాలో ఒక సెక్షన్ ను ఉద్దేశించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల విద్యార్థుల సభలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థానం గౌరవాన్ని దిగజార్చడానికి మాత్రమే ఈ తరహా వ్యాఖ్యలు దోహదపడతాయి.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర గర్హనీయం అని ఆయన అన్నారు. వెంటాడుతున్న కేసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ తదితర సమస్యలు, ప్రజల నుండి వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజారి పోతుందేమోనన్న తీవ్ర ఆందోళనకు జగన్మోహన్ రెడ్డి గారు గురౌతున్నట్లుంది. అందుకే తిట్ల పురాణాన్ని ఆశ్రయించినట్లుంది. ముఖంలో ఒకనాటి ధీమా కూడా కనబడటం లేదని లక్ష్మీనారాయణ సామాజిక ఉద్యమకారుడు తీవ్రంగా మండిపడ్డారు.