కోర్టుకు డుమ్మా కొట్టిన జగన్

కోర్టుకు డుమ్మా కొట్టిన జగన్

0
100

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కోర్టుకు డుమ్మా కొట్టారు… గతంలో అవినీతికి పాల్పడ్డారనే ఉద్దేశంతో ఆయనపై కేసు నమోదు అయింది…

ఈకేసులో భాగంగా జగన్ ప్రతీ శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాలి… కానీ ఈ రోజు హాజరు కాలేదు… ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈరోజు మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్నఅభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది…

తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది… కాగా తాను ప్రస్తుతం ప్రజా ప్రతినిధినని అందుకే తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్ వేశారు… కానీ దాన్ని కోర్టు తోసి పుచ్చింది… ప్రతీ శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది…