కోవిడ్ పై పోరాటంలో భార‌త ఆర్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం

కోవిడ్ పై పోరాటంలో భార‌త ఆర్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం

0
132

ప్ర‌పంచం అంతా వైర‌స్ తో పోరాటం చేస్తోంది, మ‌న దేశంలో కూడా సుమారు 34,000 కేసులు న‌మోదు అయ్యాయి, దీంతో వైర‌స్ విజృంభ‌ణ పెరుగుతోంది. తాజాగా భార‌త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కీల‌క విష‌యాలు తెలిపారు. ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో కలిసిమాట్లాడారు ఆయ‌న‌.

కరోనా కష్ట కాలంలో ముందుండి పోరాడిన ప్రతీ ఒక్కరికీ డిఫెన్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ స‌మ‌యంలో డాక్ట‌ర్లు పోలీసులు న‌ర్సులు పారిశుద్య కార్మికులు ఎంతో స‌ర్వీస్ చేశారు అని తెలిపారు. అంద‌రికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుపడానికి మే 3న త్రివిధ దళాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయని బిపిన్ రావత్ తెలిపారు.

1…. ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు, దిబ్రుఘర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు వైమానిక దళాల ఫ్లై పాస్ ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో విమానాల ద్వారా కొవిడ్‌-19 ఆస్పత్రులపై పూలను వెదజల్లనున్నట్లు వెల్ల‌డించారు.

2..నేవీ మే 3న యుద్దనౌకలను పూర్తిగా లైటింగ్‌తో అలంకరించి కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతుందన్నారు.

3..ఆర్మీ తనవంతుగా మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తుందన్నారు.