భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. దీంతో ఎక్కడ వారు అక్కడే ఉంటే వైరస్ స్పెడ్ కాకుండా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు, భారత్ లో కేసులు పెరగడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇండియాలో ఉంటున్న ఆస్ట్రేలియన్లు 14 రోజుల్లోగా తాము ఇండియా నుంచి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న పక్షంలో వారిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇలా ఎవరైనా ఆస్ట్రేలియాకి వస్తే వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష అని ప్రకటించింది..ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి రావాలి అనుకున్న ఆస్ట్రేలియన్లపై ఇలా క్రిమినల్ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇక ఇండియాలో కేసులు తగ్గితే దీనిపై మళ్లీ ఆలోచిస్తాము అని తెలిపారు .. ఈ నిర్ణయం పై మానవ హక్కుల బృందాలు కూడా తప్పు పట్టాయి.