బ్రేకింగ్ – హైదరాబాద్ లో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ఈ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి

covid 19 vaccine registration for drivers

0
93
కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఈ చైన్ లింక్ తెగ్గొట్టాలి, అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి, అందుకే తెలంగాణ సర్కారు దీనిపై ఫుల్ ఫోకస్ చేసింది. పది రోజుల పాటు సూపర్ స్పైడర్స్కు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది.గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని వాహనాల డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.
అయితే కచ్చితంగా ఈ డ్రైవర్లు అందరూ తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఆర్టీసీ, ఆటో, కార్ల డ్రైవర్లు ఎవరైతే ఇందులో రిజిస్ట్రర్ అవుతారో వారికి వాక్సిన్ ఇస్తారు.
ఈ వెబ్ సైట్ సందర్శించండి https://tgtransport.net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspx ఈ వెబ్ సైట్లో డ్రైవర్లు తమ లైసెన్స్ నెంబర్ అది ఇష్యూ చేసిన ప్రాంతం డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాలి హైదరాబాద్ లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లకు నేటి నుంచి టీకాలు ఇస్తున్నారు.