కోటయ్య మృతికి ఆనందయ్య మందు కారణం కాదు : సిపిఐ నారాయణ

0
113

రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతిపై సిపిఐ జాతీయ నేత కె.నారాయణ స్పందించారు. కోటయ్య మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆనందయ్య  మందుతో తాను కోలుకున్నానని స్వయంగా కోటయ్యే గతంలో వెల్లడించారని గుర్తు చేశారు.

అయితే కోటయ్యకు ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు నెల్లూరు ప్రభుత్వ వైద్యులు గతంలోనే తెలియజేశారని అన్నారు. అదే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 320 మందికి పైగా ఇప్పటి వరకు మరణించిన విషయాన్ని మరచిపోరాదన్నారు. ఆనందయ్య ఇచ్చిన ఉచిత వైద్యం పై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి రహస్య ఎజెండాను నిరసిస్తున్నాను అంటూ నారాయణ మీడియాకు తెలిపారు.