పాకిస్థాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్ధాన్ ఎలాంటి దేశమో సులువుగా తెలుస్తోంది, వారి ఆలోచన వారి పనులు ఏమిటో చెప్పుకుంటున్నారు అందరూ.
గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు, భారత్ లో ప్రతీ ఒక్కరు కూడా ఈ ఘటనతో కన్నీరు పెట్టారు, అయితే ఆ దాడి వెనుక పాక్ ఉంది అని అనేకసార్లు భారత్ కూడా ఆరోపించింది.
ఇప్పుడు ఆ దాడిపై పాకిస్థాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు నిజం అని నిరూపించాయి, పుల్వామా దాడి తమ పనే అని ఫవాద్ చౌదరి విస్పష్టంగా ప్రకటించారు.
భారత్ ని వారి సొంత ప్రాంతంలో దెబ్బకొట్టాము అని పార్లమెంట్ సాక్షిగా ఆయన వ్యాఖ్యలు చేశారు, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పాక్ ప్రజల విజయం అని అభివర్ణించారు. ఇక పాక్ ఇలా ప్రకటన చేయడం పై భారత విదేశాంగశాఖ స్పందించింది,
పాక్ ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తోందని, పాక్ ను క్షమించరాదని తెలిపింది, ఇప్పుడు ప్రపంచ దేశాలు పాక్ చేసిన పనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఆ వీడియో మాటలు మీరు వినండి
#WATCH: Pakistan's Federal Minister Fawad Choudhry, in the National Assembly, says Pulwama was a great achievement under Imran Khan's leadership. pic.twitter.com/qnJNnWvmqP
— ANI (@ANI) October 29, 2020