మేఘా వారి కంపెనీకి సిఎస్ సోమేష్ కుమార్ విజిట్

CS Somesh kumar visits MEIL Plant

0
104

 

జీడిమెట్లలోని మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. అక్కడవున్న పిఎస్ఎ (Pressure Swing Adsorption) ఆక్సిజన్ ప్లాంట్ తయారీ విభాగాన్ని ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. సంస్థ యొక్క వివిధ కార్యకలాపాల గురించి సంస్థ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శికి వివరించారు.
ఈ పర్యటనలో రాష్ట్ర ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, టిఎస్ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మెయిల్ (MEIL) ఎండి పి.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.