ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపులు, ఆ ఒక్క జిల్లాలో తప్ప : సిఎం జగన్ నిర్ణయం

Curfew relaxation in Andhra Pradesh

0
109

సిఎం జగన్లో కర్ఫ్యూ సడలింపులు : సిఎం జగన్ నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ దేశమంతా ఆంక్షలు సడలిస్తున్న వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ వేళల సడలింపుపై సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కోవిడ్ అంశంపై జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

జూన్ 20 నుంచి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 5 గంల కల్లా షాప్స్ మూసివేయాల్సి ఉంటుందని వివరించారు. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపు వర్తిస్తుంది. కోవిడ్ పాజిటివిటి రేట్ ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఈ మేరకు వెసులుబాటు ఇవ్వనున్నారు.

ఇక ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ రెగ్యులర్ గా టైమ్ ప్రకారమే నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.